పండుగపూట విషాదం.. పూలకోసం వెళ్లిన వ్యక్తి అనంతలోకాలకు

by Shyam |   ( Updated:2021-10-13 23:37:21.0  )
Sunchu Venkateshwarlu
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లాలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. పూలకోసం వెళ్లిన ఓ వ్యక్తి చెట్టుమీద నుంచి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం చాగల్లులో జరిగింది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. బతుకమ్మ పండుగ కావడంతో గ్రామానికి చెందిన సుంచు వెంకటేశ్వర్లు(50) పూలకోసం ఇంటినుంచి వెళ్లాడు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున మీదికొండ గ్రామానికి వెళ్లే మార్గంలో శవాన్ని గుర్తించిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. విషాదవార్త తెలిసిన కుటుంబంలో పండుగపూట రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed