అప్పుల బాధ తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

by srinivas |
అప్పుల బాధ తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పుల బాధ తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆళ్లగడ్డకు చెందిన దత్తయ్య ఆచారి అనే వ్యక్తి చంద్రారెడ్డి దగ్గర స్థలం తాకట్టు పెట్టి అప్పు చేశాడు. దీంతో అప్పు కడతానని చెప్పినా గడువు తీరిందని.. అప్పు తీర్చమని దత్తయ్య ఆచారిని చంద్రారెడ్డి పలుమార్లు అడిగాడు. దీంతో మనస్తాపానికి గురైన దత్తయ్య శుక్రవారం రాత్రి నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story