- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదా.. ఇక మీరే పోలీస్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్‌డ్రైవింగ్ చేస్తున్నా.. మద్యం తాగి ఇస్టానుసారంగా వాహనం నడుపుతున్నా.. ఇక ఎవరైనా వారికి ఫైన్ వేసే అవకాశం ఉంటోంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారుడి ఫోటోను పోలీసులకు పంపిస్తే చాలు.. వారే జరిమానా విధించనున్నారు. ఇప్పటి నుంచి కేవలం పోలీసులే కాదు.. సాధారణ జనం కూడా ట్రాఫిక్‌పోలీసుల మాదిరిగా విధి నిర్వర్తించవచ్చు. ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్‌ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా, మద్యం సేవించి వాహనాలు నడుపడం, రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా తిరగడం, సెల్ఫోన్మాట్లాడుతూ.. వాహనాలను నడిపేవారిని గుర్తించడం, అతి వేగంగా, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ చేసే వాహనదారులను గుర్తించడంలోప్రజలను కూడా భాగస్వాములను చేస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలను నడుపుతున్న వారిని ఒక ఫొటో తీసి, పోలీసులు ప్రకటించిన నెంబర్లకు వాట్సాప్పెడితే ఫైన్ వేస్తామంటూ వరంగల్పోలీస్కమిషనరేట్పరిధిలో ప్రకటించారు. వాహనదారులు పంపిన ఫోటోల ఆధారంగా ట్రాఫిక్ఉల్లంఘనకు పాల్పడిన వారికి జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్పోలీస్కమిషనరేట్పరిధిలో 9491089113, 9440795211, 7382629254 నెంబర్లకు ఫొటోలను వాట్సాప్ చేయాలని ప్రకటించారు. దీన్ని త్వరలోనే రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
- Tags
- key decision