వాహ్.. మీ ప్రయత్నం సూపర్

by  |
వాహ్.. మీ ప్రయత్నం సూపర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ ఏనుగుకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది. ఆ వీడియోను చూసి నెటిజన్లు సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో 15 అడుగుల లోతైన ప్రాంతంలో ఓ ఏనుగు పడిపోయింది. ఇది చూసిన ఓ రైతు అటవీశాఖ అధికారులకు సమాచారమందిచాడు. దీంతో ఆ అధికారులు అక్కడికి చేరుకుని జేసీబీ సాయంతో ఆ ఏనుగును విజయవంతంగా బయటకు తీశారు. ఇదంతా కూడా రికార్డ్ చేసిన వీడియోను సుధా రామెన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ప్రయత్నం సూపర్ అంటూ అధికారులను మెచ్చుకుంటూ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.


Tags: Elephant, social media, JCB, farmer, deep place, IFS officer

Advertisement

Next Story