కౌన్సిలర్ దురుసు ప్రవర్తన.. ఆశాల ధర్నా 

by Shyam |   ( Updated:2020-04-05 00:15:30.0  )
కౌన్సిలర్ దురుసు ప్రవర్తన.. ఆశాల ధర్నా 
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వారి పట్ల స్థానిక కౌన్సిలర్ దురుసుగా ప్రవర్తించి, నోటికొచ్చినట్టు మాట్లాడి భయాందోళనకు గురి చేశారు. దీంతో ఏడ్చుకుంటూ వెనుదిరిగిన ఆశాలు తోటి కార్యకర్తలతో విషయం తెలియజేయడంతో అందరూ సమిష్టిగా విధులు బహిష్కరించారు. ధర్నా నిర్వహించారు. కౌన్సిలర్ క్షమాపణ చెప్పే వరకు సర్వే చేసేది లేదని బైఠాయించారు.

Tags: councilor, abusive, towards, health staff, mahaboobnagar, Survey, protect

Next Story

Most Viewed