- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఏసీపీకి ఫిర్యాదు

దిశ, శంషాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై చర్యలు తీసుకోవాలని ఆదివారం శంషాబాద్ ఏసీపీ భాస్కర్ గౌడ్‌కు బీజేవైఎం నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి చేవెళ్ల మహేందర్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రసమయి బాలకిషన్‌పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి స్థాయి మరిచి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకొని రసమయి బాలకిషన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ బీజేపీ అధ్యక్షుడు దేవేందర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, స్వామి, సాయిరాం, వీరేష్, గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.