పబ్జీ ఆడొద్దన్నందుకు బాలుడు సూసైడ్

by Shyam |
పబ్జీ ఆడొద్దన్నందుకు బాలుడు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌‌లో విషాదం చోటు చేసుకుంది. పబ్జీ గేమ్ ఆడొద్దనందుకు బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలగిరిలో శనివారం జరిగిన సంఘటకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 14ఏళ్ల బాలుడు ఉదయం నుంచి పబ్జీ గేమ్ ఆడుతుండటంతో తల్లి మందలించింది. చేతిలో ఫోన్ తీసుకొని గేమ్ ఆడకుండా చేయడంతో మనస్తాపం చెందిన బాలుడు గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఎంతసేపటికీ రూమ్‌లోకి వెళ్లిన బాలుడు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి.. కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉండటాన్ని చూసి బోరున విలపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story