- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వేసవి రాకముందే మండిపోతున్న ఎండలు.. హెచ్చరిస్తోన్న వాతావరణ శాఖ!

దిశ,వెబ్‌డెస్క్: వేసవి(summer) కాలం రాకముందే ఎండలు భగభగమండిపోతున్నాయి. సాధారణంగా ఎండాకాలం ఏప్రిల్(April) నుంచి మే(May) వరకు ఉంటుంది. ఆ సమయంలో భానుడి ప్రతాపం తట్టుకోవడం కష్టమే. కానీ కొన్నేళ్లుగా వాతావరణంలో వస్తోన్న మార్పుల కారణంగా మార్చి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ఈ ఏడాది(2025) అయితే ఫిబ్రవరి(February) నెలలోనే భానుడి(sun) ప్రతాపం మొదలైంది. మధ్యాహ్నం(Afternoon) సమయంలో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటుతుంది. ఎండాకాలం(summer season) స్టార్ట్ కాకముందే ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే.. ముందు ముందు పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ(Telangana)లో రానున్న మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు(Minimum temperature) సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని తాజాగా హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. దీంతో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం సమయాల్లో పొగమంచు ఉంటుందని పేర్కొంది.
రాష్ట్రంలో మంగళవారం సరాసరి కనిష్ఠంగా 18 డిగ్రీలు, గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో 37, వరంగల్లు, నిజామాబాద్‌లో 37, మహబూబాబాద్‌లో 36.1, మెదక్‌లో 35.4, కరీంనగర్‌లో 35.2, హైదరాబాద్‌లో 34.2, నల్లగొండలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వేడి గాలులు వీస్తున్నాయని, ఆ ప్రభావం వల్లే ఎండ తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రత(temperature)లు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఉన్నాయి.