- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Weather Alert : రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణశాఖ(Department of Meteorology) వెల్లడించింది. ఈశాన్య గాలులు ఎక్కువగా వీస్తుండటమే దీనికి గల కారణమని వివరించింది. రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ(Northen Telangana)లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అదిలాబాద్, కుమురం భీం, నిర్మల్ జిల్లాల్లో అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రతలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సూచించింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవనున్నట్టు తెలిపింది.