Fengal Cyclone : మరికొద్ది గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం

by M.Rajitha |
Fengal Cyclone : మరికొద్ది గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం
X

దిశ, వెబ్ డెస్క్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 6 గంటల్లో తుపాను(Cyclone)గా మారే అవకాశం ఉందని ఐఎండీ(IMD) తెలిపింది. ఇది ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్‌(Karaikal) వద్ద తీరం దాటుతుందని ప్రకటించింది. ఈ వాయుగుండం ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలీకి ఉత్తర ఈశాన్యదిశగా 270, నాగపట్టణానికి తూర్పుగా 300, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ఫెంగల్ తుఫాను(Fengal Cyclone)గా మారిన తర్వాత వాయువ్య దిశగా కదిలి రేపు మధ్యాహ్నం సమయంలో నార్త్​ తమిళనాడు-పుదుచ్చేరి దగ్గర, కారైకాల్ - మహాబలిపురం తీరాల మధ్య, పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే టైంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(AP)​లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయన్నారు. కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, మిగిలిన అన్ని పోర్టుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed