PM Modi: ముమ్మాటికీ ఇది ప్రజల బడ్జెట్.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Shiva |
PM Modi: ముమ్మాటికీ ఇది ప్రజల బడ్జెట్.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశక పెట్టిన బడ్జెట్ ముమ్మాటికీ ప్రజల బడ్జెట్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సభ వాయిదా పడిన తరువాత ఆయన మాట్లాడుతూ.. 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. ముఖ్యంగా తయారీ రంగానికి ఎంతో ప్రాధన్యతను ఇచ్చామని పేర్కొన్నారు. ఇది నూటికి నూరు శాతం అభివృద్ధి బడ్జెట్ అని తెలిపారు. దేశంలో పెట్టుబడులకు ఈ బడ్జెట్ కొత్త బూస్ట్‌ను ఇస్తుందని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్‌ను మరింత బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.

Next Story

Most Viewed