- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శృంగారం అంటే కప్ కాఫీ కాదు అందరితో షేర్ చేసుకోవడానికి.. ఇంతలా ఎలా దిగజారావ్?

మేడమ్.. నేనొక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నాను. ఈ మధ్య కొత్తగా చేరిన కొలీగ్ ఒకతను నాతో ఒకసారి ఒక గంట సెక్స్‌లో పాల్గొనాలని ఉందని ప్రపోజ్ చేశాడు. కానీ నేను తిరస్కరించాను. మళ్లీ మళ్లీ ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు. కండోమ్ వాడుతాడట. కావలిస్తే ఒక ‘ఐపిల్’వేస్కుంటే సరిపోతుంది అంటున్నాడు. అతనితో సెక్స్‌లో పాల్గొనవచ్చా?‘ఐపిల్’వల్ల ప్రమాదమా? - టీకే, ఈమెయిల్
ఒక గంట నీతో సెక్స్‌లో పాల్గొనాలని ఉందన్న వ్యక్తి నిన్ను లైంగిక సరుకుగా మాత్రమే చూస్తున్నాడు. వెంటనే చెప్పు తీసుకొని కొట్టుంటే, పదిమందికీ చెప్పి ఉంటే, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఉంటే వాడు నిన్ను మళ్లీ ప్రపోజ్ చేసేవాడు కాదు. ‘ఐపిల్ సురక్షితమా ?’అని ఆలోచించే స్థితికి ఎందుకు దిగజారావు? పేమ విలువలు లేకుండా అపరిచితులతో సెక్స్ లో పాల్గొనాలన్న కోరికకు పునాది తాత్కాలిక మోహం తప్ప ఇంకేముంది? ఐపిల్ సురక్షితమా? కాదా? అన్న ఆలోచన కట్టి పెట్టి అతనితో కఠినంగా వ్యవహరించు. ఇది సెక్సువల్ హెరాస్‌మెంట్ కేసు కిందికి వస్తుంది. నీ మీద నీకు గౌరవం, నీకు నువ్వు విలువైన వ్యక్తివి అనుకుంటే పోలీస్ కంప్లయింట్ ఇవ్వు. సెక్స్ ఒక కప్ ఆఫ్ టీ కాదు. ఎప్పుడంటే అప్పుడు, ఎవరితో పడితే వారితో అనుభవించడానికి. సెక్స్ అనేది దంపతులు పరస్పరం ఒకరిపై ఒకరికున్న ప్రేమను, అనురక్తిని వ్యక్త పరచుకునే అందమైన దేహభాష మాత్రమే! వివాహం తర్వాత మాత్రమే సెక్స్ అనుభవం సురక్షితం!
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్