మా వారి సెక్స్ కోరికలు తీర్చలేక చస్తున్న.. ఇదేం వ్యాధి ఆయనకి..

by Bhoopathi Nagaiah |
మా వారి సెక్స్ కోరికలు తీర్చలేక చస్తున్న.. ఇదేం వ్యాధి ఆయనకి..
X

మేడమ్ ! మా వారికి “స్కీజోఫ్రీనియా” అనే మానసిక వ్యాధి ఉంది. రోజూ సెక్స్ కావాలని వేధిస్తారు. తట్టుకోలేనంత బాధ, విరక్తి కలుగుతున్నాయి. ఈ మానసిక వ్యాధి ఉన్న వారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయా? నన్నేం చేయమంటారు ఈ బాధ నుంచి విముక్తి ఎలా పొందాలి? -కనకదుర్గ, హైదరాబాద్

కొన్ని మానసిక వ్యాధుల్లో అవధుల్లేని సెక్స్ కోరికలు ఉంటాయి.“మానియా”(Mania), “స్కీజో ఫ్రీనియా”(Schizophrenia) లాంటి మానసిక వ్యాధుల్లో ఏ రకమైన మానసిక అవరోధాలూ ఉండక పోవడం కూడా ఒక ప్రధాన కారణం. వీరి మెదడులో అన్ని హేమీప్స్ఫియర్స్(Hemispheres)లో చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. అలాగే, కొన్ని శారీరిక కారణాలు ఉదాహరణకి, మెదడు ముందు భాగమైన ఫ్రంటల్ లోబ్(Frontal lobe) లో కణుతులు ఉండడం, లేదా తలకి దెబ్బ తగిలిన తరువాతి దశల్లో , ఫిట్స్ ఎటాక్ వచ్చిన తరువాతి దశల్లో రోగులలో లైంగిక వాంఛ పెరగడం గమనించారు. అలాగే, వీరిలో సెక్స్ హార్మోన్స్(Sex hormones)లో విపరీతమైన అసమతుల్యత ఉండడం కూడా ఒక కారణం. మీరొక సారి, మీ వారిని సైకియాట్రీస్ట్ & ఆండ్రాలాజిస్ట్ (Psychiatrist & Andrologist) వద్దకి తీసికెళ్లండి. వారు కొరికాల్ని అదుపులో పెట్టె హార్మోనల్ మెడిసిన్స్ (Hormonal Medicines) ఇస్తారు. అంతే కాకుండా, దంపతులిద్దరూ సెక్సాలజిస్టు (Sexologist) వద్దకు వెళ్ళితే, సెక్సువల్ కౌన్సిలింగ్(Sexual counseling) వలన కూడా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు ఉద్యోగస్తులు కాబట్టి మీ వారికి దూరంగా జాబ్ వేయించుకోవడం, వీలైనన్ని రోజులు పుట్టింటికి వెళ్లడం అంటే, మీ వారికి దూరంగా ఉండడం కూడా ఒక పరిష్కారం . మీకు శారీరికంగా, మానసికంగా కూడా విశ్రాంతి అవసరం. ఇన్ని ప్రయత్నాలు చేసినా మారకపోతే, ఈ హింస మీరు భరించవలసిన అవసరం లేదు. ఆయన రోగం దాచి, మోసం చేసి పెళ్లి చేశారు కాబట్టి ఇది చాల అన్యాయం. వివేచనతో ఆలోచించి మీ జీవితానికి మీరే న్యాయం చేసుకోండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story