నా గర్ల్ ఫ్రెండ్ నా కంటే ఎందుకు తెలివైందో ఇప్పుడు అర్థమైంది.. అవే తింటది అందుకే..

by Sujitha Rachapalli |   ( Updated:2025-04-05 09:32:58.0  )
నా గర్ల్ ఫ్రెండ్ నా కంటే ఎందుకు తెలివైందో ఇప్పుడు అర్థమైంది.. అవే తింటది అందుకే..
X

దిశ, ఫీచర్స్ : చెక్కను నమలడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలిపింది తాజా అధ్యయనం. గట్టి పదార్థాలను చూ చేయడం వల్ల గ్లూటాథయోన్ లెవల్స్ పెరిగి బ్రెయిన్ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుందని.. తద్వారా అభిజ్ఞాన శక్తి మెరుగవుతుందని వివరించింది. ఫ్రంటియర్స్ ఇన్ సిస్టమ్స్‌ న్యూరోసైన్స్‌లో ప్రచురితమైన ఈ ఇంట్రెస్టింగ్ న్యూ స్టడీ.. 52 మంది విద్యార్థులపై ప్రయోగం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది.

దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు 52 మంది ఆరోగ్యవంతమైన విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సమూహానికి చెందిన వారికి పారాఫిన్ వాక్స్ గమ్ ఇచ్చి నమలమని తెలిపిన వారు.. మరొక గ్రూపుకు చెక్కతో చేసిన టంగ్ డిప్రెసర్‌లను చూ చేయాలని చెప్పారు. ముప్పై సెకన్లు నములుతూ బ్రేక్ తీసుకుంటూ.. మళ్లీ కంటిన్యూ చేస్తూ.. ఇలా ఐదు నిమిషాలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి నమలడానికి ముందు, ఆ తర్వాత అంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ (అభిజ్ఞాన నియంత్రణకు ముఖ్యమైన మెదడు ప్రాంతం)లో గ్లూటాథయోన్ లెవల్స్ కాలిక్యులేట్ చేశారు. అభిజ్ఞాన పనితీరును అంచనా వేశారు.

ఆశ్చర్యకరమైన ఫలితాలు..

చెక్కను నమిలిన గ్రూపులో గ్లూటాథయోన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి. జ్ఞాపకశక్తి పరీక్షలలో బెస్ట్ రిజల్ట్స్ సాధించారు. అదే చూయింగ్ గమ్ నమిలిన వారిలో అంతగా మార్పు కనిపించలేదు. కాగా గ్లూటాథయోన్ మెదడు కణాలకు రక్షక “బాడీగార్డ్”గా పనిచేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి, అభిజ్ఞాన క్షీణతకు దోహదపడే హానికరమైన రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్‌ను న్యూట్రలైజ్ చేస్తుంది. మొత్తానికి చెక్క లాంటి గట్టి పదార్థాలను నమలడం, యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరగడం, మెరుగైన జ్ఞాపకశక్తి పనితీరు మధ్య ఈ సంబంధం మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి బెస్ట్ టెక్నిక్‌గా పరిగణించబడుతుంది.

మామూలుగా ఉండదు..

కాగా ఈ అధ్యయనంపై రెడిట్‌లో పెద్ద చర్చ జరుగుతోంది. ‘‘నిజంగానే చెక్కను నమిలితే తెలివి పెరుగుతుందా? నా గర్ల్ ఫ్రెండ్ నా కంటే ఎందుకు తెలివైందో ఇప్పుడు అర్థమవుతోంది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇలాంటి అధ్యయనాలు రోజుకోటి చెప్తాయని ఇంకొకరు రిప్లయ్ ఇచ్చారు. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు పెన్సిల్ నమిలేవాడినని.. అందుకే ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయ్యానేమోనని పాత రోజులు గుర్తుచేసుకుంటున్నారు చాలా మంది. ఇంకేముంది ఇంట్లో సోఫాలు ఉన్నాయిగా నమిలేయండి అనే ఫన్నీ కామెంట్స్ కూడా వస్తున్నాయి.



Next Story