20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మెగా హీరో ‘మట్కా’ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల

by Hamsa |
20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మెగా హీరో ‘మట్కా’ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన ఇటీవల నటించిన చిత్రం ‘మట్కా’(Matka). కరుణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హీరోయిన్‌గా నటించింది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘మట్కా’ భారీ అంచనాల మధ్య నవంబర్ 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. కానీ హిట్ అందుకోలేకపోయింది. వివిధ భాషల్లో రిలీజ్ అయినప్పటికీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) సొంతం చేసుకుంది. అయితే డిసెంబర్ 05 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్(Streaming) కానున్నట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed