రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

by Kavitha |
రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన రీసెంట్ మూవీ ‘లైలా’(Laila). దర్శకుడు రామ్ నారాయణ్(Ram Narayana) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్‌లో నటించాడు. ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి(Sahu Garapati) ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. అయితే రిలీజ్‌కు ముందే పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్.

ఇక భారీ అంచనాల నడుమ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, సినిమా కంటెంట్‌లో దమ్ము లేకపోవడంతో ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. విడుదల అయి నెలరోజులు కాకముందే ఈ సినిమా ఓటీటీ(OTT) స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి ఆహా(AHA)లో ఈ ‘లైలా’ చిత్రాన్ని మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆహా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసింది. దీంతో ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. ఇక ఇప్పటి వరకు ఈ మూవీ థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.




Advertisement
Next Story

Most Viewed