ఓటీటీలోకి రాబోతున్న మోస్ట్ వైలెంట్ మూవీ ‘మార్కో’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

by Hamsa |
ఓటీటీలోకి రాబోతున్న మోస్ట్ వైలెంట్ మూవీ ‘మార్కో’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
X

దిశ, సినిమా: ఉన్ని ముకుందన్(Unni Mukundan) నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్కో’(Marco). హనీఫ్ అదేనీ(Hanif Adeni) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కబీర్ దుహాన్ సింగ్(Kabir Duhan Singh), సిద్దిఖీ, జగదీశ్, యుక్తి తరేజా, అభిమన్ను తివకన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. దీనిని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Cubes Entertainments) బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్(Sharif Mohammed) నిర్మించిన.. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 20న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

అంతేకాకుండా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మోస్ట్ వైలెంట్ మూవీగా బాక్సాఫీసును షేక్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై సూపర్‌గా హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులంతా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘మార్కో’డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకోగా ఫిబ్రవరి 14న నుంచి రాబోతున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రాబోతుంది.


Next Story

Most Viewed