- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అలాగే తెలుగులోనూ మంచి మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏజ్‌లో కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్(Sunil), అర్జున్ దాస్(Arjun Das), రాహుల్ దేవ్(Rahul Dev) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ విదాముయార్చి(Vidaamuyarchi). మాగిల్ తిరుమేని(Magil Thirumeni) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘పట్టుదల’(Pattudala) పేరుతో విడుదలైంది. ఇందులో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జేట్‌తో సుభాస్కరన్(Subhaskaran) నిర్మించారు.
అయితే ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓటీటీ(OTT) ప్రియులు ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడెప్పుడు వస్తదని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాగా రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో ఓటీటీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.