ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా టాప్ వన్ ట్రెడింగ్‌లోకే వచ్చేసిందిగా..

by Kavitha |
ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా టాప్ వన్ ట్రెడింగ్‌లోకే వచ్చేసిందిగా..
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన సినిమా ‘పుష్ప-2’(Pushpa-2). ఇది ‘పుష్ప’(Pushpa) చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో దీన్ని మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జేట్‌తో నిర్మించారు. ఇక ఇందులో సునీల్(Sunil), అనసూయ(Anasuya), జగపతి బాబు(Jagapathi Babu), జగదీష్(Jagadeesh), రావు రమేష్(Rao Ramesh), ఫాహద్ ఫాజిల్(Fahad Fazil) కీలకపాత్రల్లో కనిపించారు.

డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు భారీగా కలెక్షన్లు రాబట్టింది. అంతేకాకుండా ఎన్నో రికార్డులను తిరగరాసింది. అయితే వివాదాలు కూడా ఈ స్థాయిలోనే ఎదుర్కొంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రీమియర్ షో టైంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా.. ఆ మహిళ కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో ఏమాత్రం తగ్గలేదు. భారీగానే వసూళ్లు చేసింది. అలా ఇప్పటివరకు ఈ మూవీ రూ.1900 కోట్లు రాబట్టింది. అయితే రీసెంట్‌గా రీలోడెడ్ వర్షన్‌ను యాడ్ చేయడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగాయనే చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే.. తాజాగా ‘పుష్ప-2’ డిజిటల్ స్ట్రీమింగ్‌కి రెడీ అయినట్లు నెట్ ఫ్లిక్స్(Netflix) అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. నెట్ ఫ్లిక్స్‌లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. టాప్ -10 మూవీస్‌లో నెంబర్ వన్(Number One) స్థానంలో ప్రజెంట్ ‘పుష్ప’ సినిమా కొనసాగుతుంది. కాగా ఈ చిత్రం జనవరి 30న ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed