- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pushpa-2 OTT: ‘పుష్ప-2’ ఓటీటీపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ బిగ్ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్ (ట్వీట్)

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna)హీరోయిన్‌గా నటించగా.. సునీల్, అనసూయ, జగపతి బాబు, జగదీష్, రావు రమేష్, ఫాహద్ ఫాజిల్(Fahad Fazil) కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఇది ‘పుష్ప’ సీక్వెల్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి వచ్చి భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డు సృష్టిస్తోంది.
అంతే స్థాయిలో వివాదాలు కూడా ఎదుర్కొంది. ప్రీమియర్స్ సమయంలో ఓ మహిళ చనిపోవడంతో పెద్ద వివాదమే నెలకొంది. ఈ సంఘటనలో అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇటీవల మేకర్స్ థియేటర్స్‌లో రీలోడెడ్ వెర్షన్‌ను యాడ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1896 కోట్లు రాబట్టింది. విడుదలై ఏడు వారాలు అవుతున్నప్పటికీ ఓటీటీలోకి రాకపోవడంతో..సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా.. ‘పుష్ప-2’ డిజిటల్ స్ట్రీమింగ్ రెడీ అయినట్లు నెట్‌ఫ్లిక్స్(Netflix) అధికారిక ప్రకటన విడుదల చేస్తూ బిగ్ షాకిచ్చింది. ఈ మూవీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను ఓటీటీలో చూడాలంటే అదనంగా రూ. 199 చెల్లించాలని ట్రైలర్ వీడియో ద్వారా వెల్లడించింది. అయితే ఈ మూవీని చూడాలంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ రెంట్ చెల్లించాల్సిందేనట. ఇక ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే ‘పుష్ప-2’ రెంటెడ్ పద్ధతిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపింది. అలాగే ‘‘డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు.. అదే పుష్ప’’ అనే పవర్ ఫుల్ క్యాప్షన్ జత చేశారు.
Dabbante lekka ledhu… power ante bayam ledhu… adhey Pushpa 🔥 https://t.co/4qs7VtaTfQ
— Netflix India South (@Netflix_INSouth) January 29, 2025