Niharika: ఇట్స్ అఫీషియల్.. నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న మెగా డాటర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by Hamsa |
Niharika: ఇట్స్ అఫీషియల్.. నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న మెగా డాటర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika Konidela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు యాంకర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయి పలు చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతుండగానే.. నిహారిక, జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya)ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే కొద్ది కాలం పాటు వీరి కాపురం బాగానే సాగినప్పటికీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇక విడాకులు అయినప్పటికీ నుంచి నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్లిన ఫొటోలు షేర్ చేస్తోంది. అలాగే ఇటీవల నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం అయి ‘కమిటీ కుర్రోళ్లు’(Committee Kurrollu) చిత్రంతో ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అదే ఫామ్‌తో పలు చిత్రాలను నిర్మించింది. అలాగే హీరోయిన్‌గా కూడా మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ ‘మద్రాస్‌కారన్’. షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వాలి మోహన్ దాస్(Wali Mohandas) దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాను ఎస్‌ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బి. జగదీష్ (Jagadish)నిర్మించారు. దీనికి సామ్ సీఎస్(Sam CS) సంగీతం అందించారు ‘మద్రాస్‌కారన్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్‌లో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక పొంగల్ రేసులో ఉన్న విశాల్ ‘మదగరాజ’ మాత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ నిహారిక మూవీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా, ‘మద్రాస్‌కారణ్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 7 నుంచి తమిళ భాషలో అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆహా Xద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.


Next Story

Most Viewed