Dhoom Dhaam: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Kavitha |
Dhoom Dhaam: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కుమారి 21ఎఫ్’(Kumari 21F) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడిదే మెయిన్ రోల్ కావడంతో ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ, తర్వాత వచ్చిన సినిమాలు కూడా అదే జోనర్ లాగా రావడంతో ఆమెకు పెద్దగా స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో ఈ మధ్య కొత్త కథలతో సినిమాలు చేస్తుంది అయినా కూడా ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని అందించలేదు.

ఇదిలా ఉంటే.. హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ‘ధూం ధాం’(Dhoom Dhaam). యంగ్ హీరో చేతన్ కృష్ణ(Chethan Krishna) కథానాయకుడిగా నటించిన ఈ మూవీకి.. సాయి కిషోర్ మచ్చా(Sai Kishore Macha) దర్శకత్వం వహించగా.. గోపి మోహన్(Gopi Mohan) కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఇక వెన్నెల కిషోర్‌(Vennela Kishore), సాయి కుమార్‌(Sai Kumar), గోపరాజు రమణ(Goparaju Ramana)తో పాటు పలువురు టాలీవుడ్ కమెడియన్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకుంది.

ఇక రిలీజ్ అయిన మూడు నెలల వరకు కూడా ఓటీటీ(OTT) అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వదు అని ఓటీటీ ప్రియులతో పాటు ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. కానీ ఈరోజు సడన్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. కాగా రిలీజ్ అయిన మొదటి రోజే మంచి టాక్‌ను అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి థియేటర్లలో ఆకట్టుకొని ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక స్టోరీ విషయానికి వస్తే.. రామ రాజుకు కొడుకు కార్తీక్ అంటే ప్రాణం. కొడుకు సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. కార్తీక్ కూడా తండ్రే లోకంగా బతుకుంటాడు. మరో పక్క హీరోయిన్ హీరో మధ్య గొడవలతో మొదలైన పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించేలా చేస్తుంది. ఇద్దరూ దగ్గరవుతారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఆ టైమ్‌లోనే రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయనే నిజం బయట పడుతుంది. ఆ గొడవలకు కారణం ఏమిటి? సుహానా ఫ్యామిలీకి రామరాజు, కార్తీక్ ఎలాంటి ద్రోహం తలపెట్టారు? సుహానా ప్రేమను గెల్చుకున్నాడా లేదా ఇద్దరు విడిపోయారా అనేది ఈ మూవీ స్టోరీ. ఇక ఇప్పటివరకు చూడని వారు అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను చూసేయవచ్చు.



Next Story

Most Viewed