Daku Maharaj: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Kavitha |
Daku Maharaj: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal, శ్రద్ధా శ్రీనాథ్(shraddha Srinath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా(urvashi Rautela) ఐటెం సాంగ్‌లో చిందులేసింది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. అయితే డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

అలాగే కలెక్షన్ల విషయంలోనూ మంచి వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ టీమ్ అంతా ప్రజెంట్ సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం థియేటర్లలో దుమ్ము రేపుతున్న డాకు మహారాజ్ ఎప్పుడెప్పుడు ఓటీటీ(OTT)లోకి వస్తుందా అని ఓటీటీ ప్రియులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్(Net Flix) సొంతం చేసుకున్నది.

ఇందులో భాగంగా ఈ మూవీ ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ఓటీటీలోకి రానున్నట్లు ఓ రూమర్ నెట్టింట షికారు చేస్తుంది. అలాగే దాదాపుగా ఫిబ్రవరి 9 నుంచి తెలుగు(Telugu)తో పాటు తమిళం(Tamil), మలయాళం(Malayalam), కన్నడ(Kannada), హిందీ(Hindhi) భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే దీనిపై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed