Amaran OTT date : ఓటీటీలోకి ‘అమరన్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by sudharani |   ( Updated:2024-11-29 09:42:45.0  )
Amaran OTT date : ఓటీటీలోకి ‘అమరన్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘అమరన్’ (Amaran). ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ (Major Mukund Varadarajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి (Raj Kumar Periasamy) దర్శకత్వం వహించాడు. దాదాపు రూ. 150 కోట్లు భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ మూవీ కాసుల వర్షాన్ని కురిపించింది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ (OTT) రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ‘అమరన్’ డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ఇదే డేట్‌ను ఫిక్స్ చేసినట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ‘అమరన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా డిసెంబర్ 5 నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అలాగే.. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.


Advertisement
Next Story

Most Viewed