- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ మధ్య విభేధాలు.. విడాకులు తీసుకోబోతున్నారా?

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఆరాద్య అనే కూతురు ఉంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట కొద్ది కాలంపాటు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఈ జంట స్పందించి క్లారిటీ ఇవ్వకపోవడంతో కొద్ది రోజులు వీరి విడాకుల వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత ఓ ఫంక్షన్‌లో వారు కలిసి కనిపించడంతో డైవర్స్ రూమర్లకు చెక్ పడినట్లు అయింది. అయినప్పటికీ అప్పుడప్పుడు వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘మేమిద్దరం ప్రతి రోజూ గొడవపడతాం. కానీ అవి విబేధాలు కాదు.. తగాదాలు కాదు.
అవి తీవ్రమైనవి కూడా కావు. ఆరోగ్యంగా ఉంటాయి. లేకుంటే బోరింగ్‌గా ఉంటుంది. నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్‌తో మా సంబంధం ఎలా వృద్ధి చెందుతుందో హైలైట్ చేస్తుంది. ఈ చిన్న చిన్న అభిప్రాయభేదాలు భార్యభర్తల్లో సాధారణమే. అయితే మేము ప్రతి వాదనను ముగించడానికి ఓ మధురమైన నియమం పెట్టుకున్నాం. ఎప్పుడూ కోపంగా పడుకోకూడదు. కాబట్టి నేను ముందు క్షమాపణలు చెప్తాను. ఎందుకంటే పురుషులు తరచుగా వాదనల సమయంలో లొంగిపోతారు, ఎందుకంటే వారు కొనసాగించడానికి చాలా ట్రై చేస్తారు. కానీ సగం సమయానికి మనం లొంగిపోయి క్షమించమని చెప్పడానికి కారణం మనం పడుకోవాలనుకుంటున్నాము’’ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్ గతంలోనివి అయినప్పటికీ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.