ఎన్నికల వాహనాలకు జీపీఎస్ సిస్టమ్: ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయ

by Swamyn |
ఎన్నికల వాహనాలకు జీపీఎస్ సిస్టమ్: ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయ
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు సంబంధించిన పనుల కోసం ఉపయోగించే అన్ని వాహనాలకూ ‘జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌’ను ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్(ఈసీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని మంగళవారం పోలింగ్ సిబ్బందికి తెలియజేసినట్టు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ఈవీఎంలు, ఇతర పోలింగ్ పరికరాల కదలికలను తెలుసుకోవడానికి పోలింగ్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నాం. పోలింగ్‌కు ఒకరోజు ముందు ‘డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసిప్ట్ సెంటర్’ (డీసీఆర్సీ) నుంచి పోలింగ్ స్టేషన్లకు, ఎన్నికల తర్వాత పోలింగ్ స్టేషన్ల నుంచి స్ట్రాంగ్ రూంలకు బయల్దేరే ఎన్నికల సామగ్రితో కూడిన వాహనాలను మానిటరింగ్ చేస్తాం. తద్వారా ఈవీఎంలు, ఇతర పోలింగ్ మెటీరియల్‌ ఎలాంటి ట్యాంపరింగ్‌కు గురికాకుండా చూసుకోవచ్చు’’ అని సదరు అధికారి తెలిపారు. తరలింపు సమయంలో ఏదైనా తేడాలు గమనించినట్లయితే వెంటనే సంబంధిత వాహనాల డ్రైవర్లు, ఈవీఎంల ఇన్‌చార్జి సిబ్బందిని విచారించడంతోపాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, స్కూల్ ఎడ్యూకేషన్ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రెటరీ అర్నాబ్ ఛటర్జీని బెంగాల్ జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ అధికారిగా నియమిస్తూ ఈసీ సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


Advertisement

Next Story

Most Viewed