- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
MIM ఉన్న ప్రాంతాల్లో 80 శాతం ఓటింగ్ ఎలా సాధ్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్ఐఎమ్ పార్టీపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్ఐఎమ్ పార్టీ పోటీలో ఉన్న ప్రాంతాల్లో 80 శాతం ఓటింగ్ నమోదు అవుతుందని.. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కచ్చితంగా బూత్‌లతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం ట్రిపుల్ తలాక్‌పై స్పందించారు. ముస్లిం దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ లేదని అన్నారు.
ఈ విధానాన్ని మోడీ రద్దు చేశారని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చట్టాలను రూపొందించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్న 6 గ్యారెంటీల్లో అన్నింటిని ఇంకా ఎందుకు అమల్లోకి తీసుకురావట్లేదని ప్రశ్నించారు. ఏం సాధించారని, ఏం మొహం పెట్టుకొని తుక్కుగుడలో మీటింగ్ పెట్టుకుంటున్నారని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలు చేస్తామని చెబుతున్నారన్నారు. పరోక్షంగా గ్యారంటీలు అమలు చేయమని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోబోతోందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.