CM రేవంత్ రెడ్డి నా శిష్యుడే.. ఎన్నికల వేళ మాజీ మంత్రి ప్రకటన

by GSrikanth |
CM రేవంత్ రెడ్డి నా శిష్యుడే.. ఎన్నికల వేళ మాజీ మంత్రి ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాదిలోపు ఎన్నికలు రావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నా శిష్యుడే అని అన్నారు. ఒకసారి గెలిచిన చోట రేవంత్ మళ్లీ పోటీ చేయడు అని సెటైర్ వేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. తాను ఏడుసార్లు గెలిచానని అన్నారు. మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడమే రేవంత్ రెడ్డి లక్ష్యమని విమర్శించారు. గతంలో తనకు కూడా కాంగ్రెస్‌లో మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ చేశారని.. అయినా వెళ్లలేదని గుర్తుచేశారు.


రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే దొంగలే పార్టీలు మారుతారని మండిపడ్డారు. అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని అన్నారు. తన కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెడితే ఊరుకోను అని హెచ్చరించారు. కాంగ్రెస్ లీడర్ల బెదిరింపులకు భయపడం అని చెప్పారు. అనంతరం తాను పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఎర్ర‌బెల్లి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్‌ను వీడే ప్ర‌స‌క్తే లేదని, పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇత‌ర పార్టీల్లోకి వెళ్లే ముచ్చ‌ట‌నే లేద‌ని స్ప‌ష్టంగా చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed