కోమటిరెడ్డి రాజగోపాల్ హోంగార్డు కూడా కాలేడు: BJP MP అభ్యర్థి

by GSrikanth |
కోమటిరెడ్డి రాజగోపాల్ హోంగార్డు కూడా కాలేడు: BJP MP అభ్యర్థి
X

దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బూర నర్సయ్య మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోంగార్డు కూడా కాలేడని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ ఏజెంట్ అని ఆరోపించారు. అందుకే చామలను ఎంపీ అభ్యర్థిగా పెట్టారని చెప్పారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు చామల కిరణ్ సొంత ఎమ్మెల్యేలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు.


ఢిల్లీలో లేని.. గల్లీలో లేని బీఆర్ఎస్‌కు ఓటు వేసి ఉపయోగం లేదని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశంలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా దూసుకుపోతోందన్నారు. మోడీ లాంటి నాయకుడు దేశాన్ని నడిపించడం మన అదృష్టం అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ 400ల పైచిలుకు స్థానాలు గెలుచుకోవడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్‌కు 50 సీట్లు రావడం కూడా కష్టమే అని చెప్పారు. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉంటుందో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story