రిజర్వేషన్లపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

by GSrikanth |
రిజర్వేషన్లపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు తమ ప్రచారంలో పదే పదే చెబుతున్నారు. అందుకే బీజేపీ 400 సీట్ల నినాదం ఎత్తుకుందనీ ప్రచారం చేస్తున్నారు. తాజాగా.. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హర్యానాలో పర్యటించారు. ఝ‌జ‌ర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంత‌వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్లను ఎవరు టచ్ చేయలేరు అని స్పష్టం చేశారు. ఆ ప్రయత్నం చేసినా తాము ఊరుకోమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా ఏనాడూ ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు అన్నారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగినా కాంగ్రెస్ ఆర్టికల్‌ను రద్దు చేయలేదన్నారు. పీవోకే కచ్చితంగా మనదేనని.. దానిని వెనక్కి తీసుకుంటామని మరోసారి కుండబద్దలు కొట్టి చెప్పారు. మైనార్టీ ఓటు బ్యాంకును మచ్చిక చేసుకునేందుకే కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్, సోనియా అయోధ్య బాలరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనలేదని విమర్శించారు.

Advertisement

Next Story