Virat Kohli : ఎదురులేని కోహ్లీ.. ఐపీఎల్‌లో ఆ రికార్డు కూడా విరాట్ సొంతం

by Harish |
Virat Kohli : ఎదురులేని కోహ్లీ.. ఐపీఎల్‌లో ఆ రికార్డు కూడా విరాట్ సొంతం
X

దిశ, స్పోర్ట్స్ : రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పేరిట మరో రికార్డు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు 50+ స్కోరు చేసిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. పంజాబ్‌పై 73 రన్స్ చేయడంతో విరాట్ ఈ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో కోహ్లీ మొత్తం 67 సార్లు 50+ స్కోరు చేశాడు. అందులో 59 హాఫ్ సెంచరీలు ఉండగా.. 8 శతకాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అత్యధికసార్లు 50+ స్కోరు చేసిన ప్లేయర్ల జాబితాలో డేవిడ్ వార్నర్(66)తో కలిసి కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా వార్నర్‌ను కోహ్లీ రెండో స్థానానికి నెట్టాడు. శిఖర్ ధావన్(53), రోహిత్ శర్మ(45), కేఎల్ రాహుల్(43) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.




Next Story

Most Viewed