అతనిలో అదే గొప్ప విషయం.. రజత్ పటిదార్‌పై భువీ ప్రశంసలు

by Harish |
అతనిలో అదే గొప్ప విషయం.. రజత్ పటిదార్‌పై భువీ ప్రశంసలు
X

దిశ, స్పోర్ట్స్ : ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పగ్గాలు చేపట్టిన రజత్ పటిదార్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. అతని నాయకత్వంలో ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే రజత్ నాయకత్వాన్ని ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ ప్రశంసించాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు భువీ మాట్లాడుతూ.. రజత్ చాలా ప్రశాంతంగా ఉంటాడని, గెలిచినా ఓడినా ఒకేలా ఉంటాడని చెప్పాడు.

‘రజత్ చాలా మంచివాడు. అతనిలో గొప్ప విషయం ఏంటంటే ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఐపీఎల్‌లో తీవ్ర ఒత్తిడి ఉండే ఈ ఫార్మాట్‌లో ప్రశాంతత చాలా ముఖ్యం. మ్యాచ్ ఓడిపోయినప్పుడు భయాందోళనకు గురి కావడం సాధారణం. మేము రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం. కానీ, అతను భయపడలేదు. గెలిచినా, ఓడినా ఒకేలా ఉన్నాడు. రజత్ జట్టును బాగా నడిపిస్తున్నాడు. బౌలింగ్‌లో మార్పులు, ప్రతి దానిలో అతను సూపర్.’ అని రజత్‌పై భువీ ప్రశంసలు కురిపించాడు. రజత్ పటిదార్ కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా సత్తాచాటుతున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 186 రన్స్ చేశాడు.



Next Story

Most Viewed