- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో చాహల్ పేరిట మరో రికార్డు.. ఏకైక బౌలర్‌గా
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మరో ఘనత సాధించాడు. ఇప్పటికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న అతను.. లీగ్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ నబీ(23) వికెట్ సాధించడంతో చాహల్ ఈ మైలురాయిని సాధించాడు. 2013లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన చాహల్.. ఆ తర్వాత బెంగళూరుకు చాలా కాలంపాటు ఆడాడు. 2014 నుంచి 2021 వరకు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుంచి రాజస్థాన్‌కు ఆడుతున్నాడు. మొత్తం 153 మ్యాచ్‌ల్లో చాహల్ 21.57 సగటు, 7.72 ఎకానమీతో 200 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లోనూ చాహల్ తన స్పిన్ మంత్రంతో అదరగొడుతున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసిన అతను.. బుమ్రా, హర్షల్ పటేల్‌తో కలిసి టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.