- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాటుతోనే కాదు.. క్యాచ్‌ల్లోనూ కోహ్లీ రారాజే
దిశ, స్పోర్ట్స్ : రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత చేరింది. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుకెక్కాడు. ఐపీఎల్-17లో పంజాబ్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(172 క్యాచ్‌లు) పేరిట ఈ రికార్డు ఉండేది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్‌ను పట్టడంతో విరాట్ 173 క్యాచ్‌లతో రైనాను అధిగమించాడు. మూడో స్థానంలో రోహిత్(167) ఉండగా.. మనీశ్ పాండే(146), సూర్యకుమార్(136) టాప్-5లో ఉన్నారు.
అలాగే, ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ టీ20ల్లో 100వ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో 100 టీ20 హాఫ్ సెంచరీలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన జాబితాలో క్రిస్ గేల్(110) టాప్‌లో ఉండగా.. వార్నర్(109) తర్వాత కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.