క్రికెట్‌ అభిమానులకు హెచ్చరిక! టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
క్రికెట్‌ అభిమానులకు హెచ్చరిక!  టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్‌ అభిమానులకు హెచ్చరికలు తెలియజేస్తూ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్ మ్యాచ్‌కు విపరీతమైన డిమాండ్‌ నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారని వెల్లడించారు. టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ ఇన్‌స్టా రీల్స్‌, స్టోరీలు, యూట్యూబ్‌ షార్ట్స్‌ లో ఇలా ఇబ్బడిముబ్బడిగా ఫేక్‌ లింక్‌లను పోస్టు చేస్తున్నారని తెలిపారు.

ఎలాగైన స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులను టార్గెట్‌ చేస్తూ.. లక్షల్లో దండుకుంటున్నారన్నారు. క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారని, ఇలాంటి పోస్టుల పట్ల క్రికెట్‌ అభిమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ లింక్‌లపై అసలే క్లిక్‌ చేయొద్దని, క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేస్తే మీ బ్యాంకు ఖాతాల్లోని నగదు గుల్లవుతుంది.. జాగ్రత్త.. అని సజ్జనార్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story