- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > స్పోర్ట్స్ > IPL 2025 > కోహ్లీ, గంభీర్ హగ్ వీడియో వైరల్..వారికి ఆస్కార్ ఇవ్వాలన్న సునీల్ గవాస్కర్
కోహ్లీ, గంభీర్ హగ్ వీడియో వైరల్..వారికి ఆస్కార్ ఇవ్వాలన్న సునీల్ గవాస్కర్
by Harish |

X
దిశ, స్పోర్ట్స్ : బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గత సీజన్‌లో లక్నో, బెంగళూరు మ్యాచ్‌లో గంభీర్, కోహ్లీ వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య మాటలు కలిశాయి. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో మైదానంలోకి వచ్చిన గంభీర్.. కోహ్లీతో మాట్లాడాడు. అలాగే, హగ్ చేసుకున్నారు. ఈ వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు ఎక్స్‌లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి.. ఈ క్షణం ఫెయిర్ ప్లే అవార్డుకు అర్హుత కలిగిందన్నాడు. వెంటనే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. ‘కేవలం ఫెయిర్ ప్లే అవార్డు మాత్రమే కాదు.. వారికి ఆస్కార్ ఇవ్వాలి.’ అని వ్యాఖ్యానించాడు. కోల్‌కతాకు గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Next Story