- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లకు అతను దేవుడు.. కచ్చితంగా గుడి కడతారు.. రాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో రాయుడు మాట్లాడుతూ.. ధోనీపై ప్రశంసలు కురిపించాడు. త్వరలోనే చెన్నయ్‌లో ధోనీకి గుడి కడతారన్నాడు. ‘అతను చెన్నయ్‌కి దేవుడు. రాబోయే సంవత్సరాల్లో ధోనీకి చెన్నయ్‌లో దేవాలయం కడతారని కచ్చితంగా చెప్పగలను. రెండు వరల్డ్ కప్‌లు సాధించి భారత్‌కు ఆనందాన్ని అందించిన వ్యక్తి అతను. ఐపీఎల్, చాంపియన్ లీగ్ టైటిల్స్‌తో చెన్నయ్‌కు సంతోషానిచ్చాడు. ధోనీ తన ఆటగాళ్లపై ఎంతో నమ్మకం ఉంచుతాడు. దేశం, జట్టు, సీఎస్కే కోసమే ఆడతాడు.’ అని రాయుడు చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్-17 ధోనీకి చివరి సీజన్ అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ లీగ్ దశలో చెన్నయ్ సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై నెగ్గి ప్లే ఆఫ్స్ ఆశలను మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్ అనంతరం అభిమానులు స్టేడియంలోనే ఉండాలని సీఎస్కే ఫ్రాంచైజీ కోరడంతో.. ధోనీ రిటైర్మెంట్‌పై ప్రకటన చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ, ధోనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మ్యాచ్ ముగిశాక సహచర ఆటగాళ్లతో కలిసి మైదానంలో తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. కాగా, ఈ నెల 18న చెన్నయ్ చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరుతో ఆడనుంది. చెన్నయ్ నాకౌట్ బెర్త్ ఆశలు ఈ మ్యాచ్‌పైనే ఆధారపడి ఉన్నాయి.