డకౌట్‌లతో ఐపీఎల్ చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..

by Mahesh |
డకౌట్‌లతో ఐపీఎల్ చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అనేక రికార్డులను సృష్టిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ సారి వెరైటీగా ఐపీఎల్ లో అత్యధికంగా డకౌట్ అయిన బ్యాటర్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. శనివారం చెన్నై తో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ కేవలం మూడు బంతులకు 0 పరుగులకు డకౌట్ అవ్వగా ఇది అతని ఐపీఎల్ కెరియర్ లో 16వ డకౌట్ గా నమోదైంది. దీంతో గతంలో 15 డకౌట్లతో ఉన్న దినేశ్ కార్తీక్, మన్దీప్ సింగ్, సునీల్ నరైన్ లను రోహిత్ అధిగమించి మొదటి స్థానం దక్కించుకున్నాడు.

Advertisement

Next Story