- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: ఐపీఎల్-16కు దూరమయ్యే స్టార్లు వీరే..
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-16కు పలువురు స్టార్ క్రికెటర్లు దూరం కానున్నారు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించిన రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న విషయం తెలిసిందే. దాంతో ఈ సీజన్‌కు అతను పూర్తిగా దూరమయ్యాడు. అతని స్థానంలో డేవిడ్ వార్నర్ జట్టు పగ్గాలు చేపట్టాడు. పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బెయిర్‌స్టో కాలికి సర్జరీ కావడంతో ఈ సారి అతని మెరుపులు చూడలేం. అతని స్థానాన్ని పంజాబ్ జట్టు ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ షార్ట్‌తో భర్తీ చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం అందుబాటులో ఉండటం లేదు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో వెన్నునొప్పితో వైదొలిగిన అతను.. ప్రస్తుతం ఇంకా కోలుకోలేదు. దాంతో నితీశ్ రాణా ఈ సీజన్‌లో కోల్‌కతాను నడిపించబోతున్నాడు.
వెన్ను నొప్పితో దాదాపు 6 నెలలుగా ఆటకు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ బుమ్రా ఈ సారి ఐపీఎల్‌లో పాల్గొనడం లేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతను ఈ సీజన్‌లో కనిపించడు. అలాగే, వెన్నునొప్పితో రాజస్థాన్ పేసర్ ప్రసిద్ కృష్ణ ఆ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సందీప్ శర్మను జట్టు ఎంపిక చేసుకుంది. వెన్ను గాయం కారణంగా 9 నెలలుగా ఆటకు దూరమైన సీఎస్కే పేసర్ కైల్ జేమీసన్ సైతం ఐపీఎల్‌కు దూరంకానున్నాడు. సీఎస్కే ఫ్రాంచైజీ అతని స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ సిసిందాను జట్టులో చేర్చుకుంది. వీరితోపాటు పలువురు వివిధ కారణాలతో ఐపీఎల్‌లో పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదు.