మే 18న చెన్నయ్‌తో బెంగళూరు ఢీ.. ఎవరు గెలుస్తారో చెప్పేసిన క్రిస్ గేల్

by Harish |
మే 18న చెన్నయ్‌తో బెంగళూరు ఢీ.. ఎవరు గెలుస్తారో చెప్పేసిన క్రిస్ గేల్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన చివరి గ్రూపు మ్యాచ్‌లో చెన్నయ్‌తో తలపడనుంది. మే 18న జరిగే మ్యాచ్‌కు బెంగళూరు వేదిక. ఆ మ్యాచ్‌లో బెంగళూరే గెలుస్తుందని విండీస్ విధ్వంసకర ప్లేయర్ క్రిస్ గేల్ జోస్యం చెప్పాడు. జియో సినిమాతో క్రిస్ గేల్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌ ప్రతి సీజన్‌లోనూ చెన్నయ్, బెంగళూరు మ్యాచ్ బిగ్గెస్ట్ గేమ్ అని చెప్పాడు. ‘ఐపీఎల్-2024లో బెంగళూరు తన చివరి మ్యాచ్‌లో చెన్నయ్‌తో ఆడనుందని నాకు తెలుసు. మేము చాలా దూరం చూడటం లేదు. కానీ, బెంగళూరులో ఆర్సీబీని చెన్నయ్ ఓడించడం నేను చూడలేదు. పరిస్థితులు ఎలా ఉంటాయనేది ముఖ్యం కాదు. మే 18న ఆర్సీబీ గెలవడాన్ని నేను చూస్తాను.’ అని క్రిస్ గేల్ తెలిపాడు. కాగా, ఈ నెల 22న ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నయ్ చేతిలో బెంగళూరు ఓడిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story