- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2024 : బెంగళూరును ఆదుకున్న కోహ్లీ.. కోల్‌కతా ముందు టఫ్ టార్గెట్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయాడు. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ అండతో కోల్‌కతా ముందు బెంగళూరు 183 పరుగుల టఫ్ టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకోగా.. బెంగళూరు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత ఓవర్లలో ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.
మొదట బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(8) నిరాశపర్చాడు. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ జట్టుకు అండగా నిలిచాడు. గ్రీన్(33), మ్యాక్స్‌వెల్(28) నుంచి అతనికి మంచి సహకారం అందింది. దీంతో కోహ్లీ వికెట్ కాపాడుకుంటూనే బౌలర్లపై దాడిని కొనసాగిస్తూ జట్టును నడిపించాడు. ఈ క్రమంలోనే 36 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గ్రీన్, మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత భారం మొత్తం కోహ్లీపైనే పడింది. రజత్ పటిదార్(3), అనుజ్ రావత్(3) నిరాశపరిచారు. ఇక, ఆఖర్లో దినేశ్ కార్తిక్ మరోసారి మెరిశాడు. చివరి రెండు ఓవర్లలో కార్తిక్, విరాట్ కలిసి 29 పరుగులు పిండుకోవడంతో బెంగళూరు స్కోరు 180 దాటింది. చివరి బంతికి కార్తిక్(20) రనౌట్ అవ్వగా.. కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.