ఇటువంటి అద్భుతాలు అతడి ఒక్కడికే సాధ్యం : సురేష్‌ రైనా

by Vinod kumar |
ఇటువంటి అద్భుతాలు అతడి ఒక్కడికే సాధ్యం : సురేష్‌ రైనా
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 Final మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టి చెన్నైను ఛాంపియన్స్‌గా నిలిసిన రవీంద్ర జడేజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జడేజాపై టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. అసాధ్యాలను సుసాధ్యం చేసే సత్తా సర్‌ జడేజాకు ఒక్కడికే ఉందని రైనా కొనియాడు. "తీవ్రమైన ఒత్తిడిలో కూడా జడ్డూ తన మాస్టర్‌ క్లాస్‌ను ప్రదర్శించాడు. అందుకే ఎంఎస్ ధోని కూడా జడేజాను ఎత్తుకుని సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

ఇటువంటి అద్భుతాలు సర్‌ జడేజాకు ఒక్కడే సాధ్యం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ క్షణాన్ని దేశం మొత్తం గర్వించింది. మొత్తం పసుపు రంగుగా మారిపోయింది" అని సురేష్‌ రైనా పేర్కొన్నాడు. కాగా చెన్నై విజయానికి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు కావాల్సి ఉండగా.. చివరి ఓవర్‌ వేసిన మొహిత్‌ శర్మ తొలి నాలుగు బంతులకు కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆఖరి రెండు బంతులకు 10 పరుగులు అవసరమవ్వగా.. జడ్డూ వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది గుజరాత్‌ టైటాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.


Advertisement
Next Story

Most Viewed