- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో చెన్నయ్ ఆటగాళ్లలో గందరగోళం.. నిజమేనన్న దీపక్ చాహర్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 ప్రారంభానికి ఒక్క రోజు ముందు చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎం.ఎస్ ధోనీ వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ పగ్గాలు చేపట్టాడు. అతని సారథ్యంలో చెన్నయ్ వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్నది. అయితే, గైక్వాడ్‌పై కెప్టెన్సీ ఒత్తిడి పడకుండా ధోనీ అతన్ని వెనుకుండి నడిపిస్తున్నాడు. జట్టు ఎంపిక మొదలు మైదానంలో ఫీల్డింగ్ సెటప్ వరకు గైక్వాడ్‌కు పలు సూచనలు ఇస్తున్నాడు.
అయితే, నిర్ణయాధికారం విషయంలో ఆ జట్టు ఆటగాళ్లు గందరగోళానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫీల్డింగ్ సెటప్‌లో గైక్వాడ్, ధోనీలలో ఎవరిని సంప్రదించాలనేది బౌలర్లలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ విషయాన్ని ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ కూడా అంగీకరించాడు. ‘గత రెండు మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్‌తోపాటు కొన్ని విషయాల్లో మాహీ భాయ్‌ను, గైక్వాడ్‌ను చూడాల్సి వచ్చింది. కొద్ది గందరగోళమైతే ఉంది. కానీ, రుతురాజ్ జట్టును బాగా నడిపిస్తున్నాడు.’ అని చాహర్ తెలిపాడు. కాగా, ఓపెనింగ్ మ్యాచ్‌లో బెంగళూరుపై గెలుపు ఖాతా తెరిచిన చెన్నయ్.. మంగళవారం గుజరాత్‌పై రెండో విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నయ్ తలపడనుంది.