- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై తడాఖా.. బెంగళూరు ఆశలపై నీళ్లు
దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. బ్యాటింగ్ మెరుపులతో బెంగళూరు ఆశలపై నీళ్లుచల్లింది. దీంతో ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయగా.. బెంగళూరు వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. గురువారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 196/8 స్కోరు చేసింది. డు ప్లెసిస్(61), దినేశ్ కార్తీక్(53), రజత్ పటిదార్(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ముంబై బౌలర్లలో బుమ్రా(5/21) ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై 15.3 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. 3 వికెట్లు 199 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(69), సూర్యకుమార్(52) రెచ్చిపోవడంతో ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని పూర్తి చేసింది. రోహిత్(38), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 నాటౌట్) రాణించారు. పాయింట్స్ టేబుల్‌లో ముంబై 7వ స్థానానికి చేరుకోగా.. బెంగళూరు చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
చితక్కొట్టారు
197 పరుగుల లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు. వీరు ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో పవర్ ప్లేలో ముంబై 72/0తో నిలిచింది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా వీరు అదే జోరు కొనసాగించగా.. ఈ జోడీకి ఆకాశ్ దీప్ తెరదించాడు. అతను వేసిన 9వ ఓవర్‌లో ఇషాన్ కిషన్(69) క్యాచ్ అవుటవడంతో తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రోహిత్(38) కూడా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్‌లో నిరాశపర్చిన సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 24 పరుగులు పిండుకున్న అతను.. టోప్లే బౌలింగ్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. దీంతో 17 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో సూర్య(52) దూకుడుకు విజయ్‌కుమార్ చెక్ పెట్టాడు. అయితే, సూర్య మెరుపులతో అప్పటికే మ్యాచ్ పూర్తిగా ముంబై చేతుల్లోకి వెళ్లింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 నాటౌట్), తిలక్ వర్మ(16 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. ఆర్సీబీ బౌలర్లలో ఆకాశ్ దీప్, విజయ్‌కుమార్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు.
బుమ్రా బెంబేలెత్తించినా.. ఆ ముగ్గురూ మెరిశారు
అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్ తడబడుతూనే ప్రారంభమైంది. భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ(3)ని మూడో ఓవర్‌లోనే బుమ్రా పెవిలియన్ పంపడంతో ఆరంభంలోనే ఆర్సీబీకి షాక్ తగిలింది. కాసేపటికే విల్ జాక్స్(8) వికెట్ పారేసుకున్నాడు. దీంతో ఆర్సీబీ 23/2తో తడబడగా.. కెప్టెన్ డుప్లెసిస్, రజత్ పటిదార్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరు బౌండరీలతో స్కోరు బోర్డు వేగం పెంచారు. దీంతో 393/2 స్కోరుతో ఆ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రజత్ పటిదార్(50)ను కోయ్టజి అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. మ్యా్క్స్‌వెల్(0) మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు, కెప్టెన్ డుప్లెసిస్ ఈ సీజన్‌లో తొలి అర్ధ శతకం పూర్తి చేశాడు. కార్తీక్, డుపెస్లిస్ ధాటిగా ఆడటంతో బెంగళూరు భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే, బుమ్రా ఒక్కసారిగా ఆర్సీబీని కట్టడి చేశాడు. వరుస ఓవర్లలో డుప్లెసిస్(61), లోమ్రోర్(0), సౌరవ్ చౌహాన్(9), విజయ్‌కుమార్(0)లను అవుట్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న దినేశ్ కార్తీక్ మాత్రం మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 19 పరుగులు పిండుకోవడంతోపాటు 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో సత్తాచాటగా.. కోయ్టెజి, ఆకాశ్, శ్రేయస్ గోపాల్‌కు చెరో వికెట్ దక్కింది.
స్కోరుబోర్డు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 196/8(20 ఓవర్లు)
కోహ్లీ(సి)ఇషాన్ కిషన్(బి)బుమ్రా 3, డుప్లెసిస్(సి)టిమ్ డేవిడ్(బి)బుమ్రా 61, విల్ జాక్స్(సి)టిమ్ డేవిడ్(బి)ఆకాశ్ 8, రజత్ పటిదార్(సి)ఇషాన్ కిషన్(బి)గెరాల్డ్ కోయ్టెజి 50, మ్యాక్స్‌వెల్ ఎల్బీడబ్ల్యూ(బి)శ్రేయస్ గోపాల్ 0, కార్తీక్ 53 నాటౌట్, లోమ్రోర్ ఎల్బీడబ్ల్యూ(బి)బుమ్రా 0, సౌరవ్ చౌహాన్(సి)ఆకాశ్(బి)బుమ్రా 9, విజయ్‌కుమార్(సి)నబీ(బి)బుమ్రా 0, ఆకాశ్ దీప్ 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 10.
వికెట్ల పతనం : 14-1, 23-2, 105-3, 108-4, 153-5, 153-6, 170-7, 170-8
బౌలింగ్ : నబీ(1-0-7-0), కోయ్టజి(4-0-42-1), బుమ్రా(4-0-21-5), ఆకాశ్(4-0-57-1), శ్రేయస్ గోపాల్(4-0-32-1), రొమారియో షెఫర్డ్(2-0-22-0), పాండ్యా(1-0-13-0)
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 199/3(15.3 ఓవర్లు)
ఇషాన్ కిషన్(సి)కోహ్లీ(బి)ఆకాశ్ దీప్ 69, రోహిత్(సి)టోప్లే(బి)విల్ జాక్స్ 38, సూర్యకుమార్(సి)లోమ్రోర్(బి)విజయ్‌కుమార్ 52, పాండ్యా 21 నాటౌట్, తిలక్ 16 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3.
వికెట్ల పతనం : 101-1, 139-2, 176-3
బౌలింగ్ : రీస్ టోప్లే(3-0-34-0), సిరాజ్(3-0-37-0), ఆకాశ్ దీప్(3.3-0-55-1), మ్యాక్స్‌వెల్(1-0-17-0), విజయ్‌కుమార్(3-0-32-1), విల్ జాక్స్(2-0-24-1)