- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాహుల్‌కు కీలక సూచన చేసిన రాయుడు

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ తొలి భాగం ఆధారంగానే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే, భారత స్టార్ క్రికెటర్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం బ్యాటుతో తడబడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఓపెనర్‌గా వస్తున్న అతను తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మినహా పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక సూచన చేశాడు.
తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో రాయుడు మాట్లాడుతూ.. రాహుల్ ఓపెనర్‌గా రావద్దని, నం.3 లేదా నం.4లో బ్యాటింగ్‌కు రావాలని సూచించాడు. ‘రాహుల్ ఇంకా ఫామ్ అందుకోవాల్సి ఉంది. అతను త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడనుకుంటున్నా. భారత జట్టులో ఓపెనర్ల కోసం చాలా పోటీ ఉంది. భారత జట్టు కోసం పరిగణలో ఉండాలంటే రాహుల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రావాలి. అది లక్నోకు కూడా మంచిదే. చివరి వరకు క్రీజులో ఉండొచ్చు. భారత జట్టుకు కూడా అదే కావాలి.’ అని రాయుడు తెలిపాడు. కాగా, ఐపీఎల్-17లో రాహుల్ నాలుగు మ్యాచ్‌ల్లో 31.5 సగటుతో 126 పరుగులు మాత్రమే చేశాడు.