- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేకేఆర్ ఫైనల్ ఓవర్ హీరోకు షాకిచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు
దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బౌలర్ హర్షిత్ రాణాకు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్‌హెచ్)తో శనివారం జరిగిన మ్యాచ్ ఫీజులో 60 శాతం కోతపెట్టారు. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండెక్ట్‌లోని ఆర్టికల్ 2.5 ప్రకారం రాణా రెండు లెవల్ 1 తప్పిదాలు చేశాడు. అందుకు అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం, 50 శాతం జరిమానా విధించాం.’ అని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లను అవుట్ చేసినప్పుడు రాణా.. బ్యాటర్లను కోపంగా చూస్తూ ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి జరిమానా పడినట్టు తెలుస్తోంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్‌లో హైదరాబాద్ విజయానికి 13 పరుగులు కావాల్సిన సమయంలో.. చివరి ఓవర్‌ను అద్భుతంగా వేసిన హర్షిత్ రాణా రెండు వికెట్లు తీయడంతోపాటు 8 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.