రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్

by Mahesh |
రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్
X

లక్నో : గాయం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-16 మిగతా సీజన్‌కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ స్థానాన్ని లక్నో ఫ్రాంచైజీ భర్తీ చేసింది. లక్నో తమ మిగతా మ్యాచ్‌లకు కోసం రాహుల్ స్థానంలో సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్‌ను తీసుకుంది. ఈ మేరకు లక్నో ఫ్రాంచైజీతో అతనితో రూ. 50 లక్షలకు ఒప్పందం చేసుకుంది.

కాగా, గతంలో ఐపీఎల్‌లో కరుణ్ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 76 మ్యాచ్‌లు ఆడిన అతను 1, 496 పరుగులు చేశాడు. అలాగే, టీమ్ ఇండియా తరఫున 6 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో అతని పేరిట త్రిబుల్ సెంచరీ ఉంది. అయితే, కర్ణాటక జట్టు నుంచి తప్పించిన తర్వాత అతను ఈ ఏడాది ప్రొఫెషనల్ క్రికెట్‌ ఆడలేదు.

Advertisement

Next Story

Most Viewed