చాలా విషయాలు ఆటగాళ్ల చేతుల్లో ఉండవు : ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు

by Harish |
చాలా విషయాలు ఆటగాళ్ల చేతుల్లో ఉండవు : ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులో ఉండటం లేదనే కారణంతో భారత క్రికెటర్లు ఇషాన్ కిషన్‌, శ్రేయస్ అయ్యర్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దీనిపై ఇషాన్ కిషన్ తొలిసారిగా నోరువిప్పాడు. గురువారం బెంగళూరుతో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ‘విరామ సమయంలో ఏం చేశారు’ అన్న ప్రశ్నకు అతను స్పందిస్తూ.. ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. ‘నేను ఆట నుంచి విరామం తీసుకున్నప్పుడు చాలా మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో ఏదోదో ప్రచారం జరిగింది. కానీ, చాలా విషయాలు ఆటగాళ్ల చేతుల్లో ఉండవని గ్రహించాలి.’ అని చెప్పాడు.

విరామ సమయంలో తన ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపాడు. ‘సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడమే మనం చేయగలిగిన పని. గ‌తంలో మొద‌టి రెండు ఓవ‌ర్లలో ఏ బంతిని వదిలిపెట్టేవాడిని కాదు. కానీ, 20 ఓవర్ల ఆట చాలా పెద్దదని తెలిసింది. సమయానికి తీసుకుని ఆ తర్వాత ముందుకు సాగొచ్చు. నేను ప్రదర్శన చేయకపోయినా, వేరొకరు ప్రదర్శన చేయడం లేదని తెలిస్తే వారితో వెళ్లి మాట్లాడుతున్నాను. వారు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుంటున్నా. విరామంలో ఇలా చాలా విషయాలు నాకు సహాయపడ్డాయి.’ అని ఇషాన్ కిషన్ తెలిపాడు. కాగా, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతను హాఫ్ సెంచరీతో సత్తాచాటిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story