- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిషబ్ పంత్‌కు షాకిచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు.. కారణం ఏంటంటే?
దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. ఆదివారం చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు పంత్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. తొలి తప్పిదంగా ఐపీఎల్ నిర్వాహకులు కేవలం కెప్టెన్‌కు మాత్రమే జరిమానా విధించారు. రెండోసారి పునరావృతమైతే కెప్టెన్ జరిమానా పెరగడంతోపాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు కోత పడనుంది.
టోర్నీలో మరో రెండు సార్లు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘిస్తే పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ కారణంగా ఫైన్ ఎదుర్కొన్న రెండో కెప్టెన్ పంత్. పంత్ కంటే ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ.12 లక్షలు జరిమానా పడింది. గిల్‌కు కూడా చెన్నయ్‌తో మ్యాచ్‌లోనే జరిమానా విధించడం గమనార్హం.
చెన్నయ్‌పై 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు పరాజయాల తర్వాత చెన్నయ్‌ను ఓడించి సీజన్‌లో గెలుపు ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న అతను ఐపీఎల్‌తోనే రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్వల్ప స్కోరుకే నిరాశపర్చిన చెన్నయ్‌పై మునుపటి పంత్‌ను గుర్తు చేశాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులు చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.