పాండ్యాకే అదొక్కటే మార్గం : బ్రియాన్ లారా

by Harish |
పాండ్యాకే అదొక్కటే మార్గం : బ్రియాన్ లారా
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించడాన్ని అతని ఫ్యాన్స్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కొత్త సారథి హార్దిక్ పాండ్యాను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఆ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కామెంటేటర్లుగా వ్యవహరించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు బ్రియాన్ లారా, ఇయాన్ బిషప్ దీని గురించి మాట్లాడుకున్నారు. ‘ఓ భారత క్రికెటర్‌‌ ఇంతలా హేళనకు గురికావడం నేనెప్పుడూ చూడలేదని’ కెవిన్ పీటర్సన్ అన్నాడు. వెంటనే ఇయాన్ బిషప్ మాట్లాడుతూ.. ‘హార్దిక్ తిరిగి వాళ్ల మనసుల గెలుచుకోవాలంటే ఏం చేయాలి?’ అని అడిగాడు. దీనిపై బ్రియాన్ లారా స్పందిస్తూ..‘పాండ్యా భారత్ కోసం ఆడాలి. అప్పుడే నెక్ట్స్ టైం ఇక్కడ ఆడతారు.’ అని బదులిచ్చాడు. గుజరాత్‌తో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై జట్టు పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story